అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.వీడియోను చూస్తే అది పెళ్లి వేడుకనా? లేక లగ్జరీ స్పా కేఫా? (Luxury Spa or Cafe) అనే సందేహం కలుగుతోంది.
అద్భుతమైన లైటింగ్, భారీ డెకరేషన్, వివాహ వేదికలా కనిపించే సెటప్ మధ్య… అతిథులు మాత్రం సోఫాలపై హాయిగా కూర్చుని పాదాలకు మసాజ్‌లు చేయించుకుంటూ కనిపిస్తున్నారు.వీడియోలో యూనిఫాం ధరించిన సిబ్బంది అతిథులకు ఫుట్ మసాజ్‌లు చేస్తుండగా, అతిథులు పూర్తిగా రిలాక్స్ అయిన మూడ్‌లో కనిపించారు. సాధారణంగా పెళ్లిళ్లలో భోజనాల కోసం వరుసల్లో నిలబడే అతిథులు ఇక్కడ మాత్రం ముందుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
Viral Video | ఇదో కొత్త ట్రెండ్
“ముందు రిలాక్స్, తర్వాత ఫుడ్” అన్న కాన్సెప్ట్‌ను నిర్వాహకులు అమలు చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోకు జత చేసిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది.“ఇప్పుడు పెళ్లి వేడుకలు అంటే కేవలం భోజనాలు మాత్రమే కాదు… శారీరక విశ్రాంతి కూడా” అని అందులో పేర్కొన్నారు. ఈ లైన్‌నే ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది.వీడియో వైరల్ కావడంతో కామెంట్ సెక్షన్ మొత్తం ఫన్నీ ఎమోజీలు, సరదా వ్యాఖ్యలతో నిండిపోయింది.ఒక నెటిజన్ “ప్రతిరోజూ ఇలాంటి పెళ్లులకు పిలిస్తే బాగుంటుంది” అని కామెంట్ చేయగా,మరో వ్యక్తి “మా పెళ్లిలో కుర్చీలు కూడా సరిగ్గా లేవు” అంటూ సరదాగా స్పందించారు.కొంతమంది దీనిని లగ్జరీ వెడ్డింగ్ (Luxury Wedding) ట్రెండ్‌గా ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం “ఇది అవసరానికి మించి చేస్తున్న ఆర్భాటం” అంటూ విమర్శిస్తున్నారు.
వివాహ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఈ మధ్య పెళ్లిళ్లలో ప్రత్యేక అనుభవాలను అందించే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. లైవ్ మ్యూజిక్, గేమ్ జోన్లు, థీమ్ డెకరేషన్లు వంటి వాటికి తోడు ఇప్పుడు ఫుట్ స్పాసేవలు (Foot Spa Services) కూడా చేరాయి.ఇప్పటి పెళ్లిళ్లు కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రత్యేక క్షణాలను సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ఈ పెళ్లి వీడియో ట్రెండా? లేక కేవలం వైరల్ జిమ్మిక్కా? అన్నదానిపై నెటిజన్ల మధ్య చర్చ మాత్రం ఆగడం లేదు.
View this post on Instagram