అక్షరటుడే, అమరావతి: Group-1 results | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ – 1 తుది ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ APPSC విడుదల చేసింది. మొత్తం 87 పోస్టులకు డిసెంబరు, 2023లో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ క్రమంలో అభ్యర్థులు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. మార్చి, 2024లో ప్రిలిమ్స్, మే 2025లో మెయిన్స్, జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Group-1 results | హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో..
కాగా, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా ఫలితాలపై ఎపీపీఎస్సీ ముందుకెళ్లొచ్చనే ఆదేశాలను న్యాయస్థానం ఇచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఫలితాలను రిలీజ్ చేసింది. రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పబ్లిక్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 ఫలితాల వివరాలను అధికారిక ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.గ్రూప్ 1 ఫలితాలు