Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | సొసైటీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Bodhan | సొసైటీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జిల్లాలోని వరి కోతలు కొనసాగుతుండడంతో అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. పలు ప్రాంతాలను కేంద్రాలను ప్రారంభిస్తోంది. కాగా.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | మండలంలోని పలు సొసైటీల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Grain purchase centers) ప్రారంభమయ్యాయి. సొసైటీల స్పెషల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ మినార్​పల్లి, అమ్దాపూర్​లలో (Amdapur) కొనుగోళ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్​ ధాన్యానికి రూ.2,389 రెండో గ్రేడ్​ ధాన్యానికి రూ.2,369 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సొసైటీల కార్యదర్శులు హన్మాండ్లు, రాజేశ్వర్​, కిరణ్​ కుమార్​ పాల్గొన్నారు.