అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
“నో ఫ్రెండ్షిప్.. నో రిలేషన్స్.. పార్టీ ఫస్ట్” అనే విధానంతో, ఫీల్డ్‌లో పనిచేసే వారికే భవిష్యత్‌లో పదవులు, బాధ్యతలు ఇవ్వాలన్న ధోరణి వైసీపీ లోపల స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత బేస్ ఏరియా అయిన రాయలసీమ జిల్లా (Rayalaseema District)ల్లో ఓటర్ల నమ్మకం తిరిగి సంపాదించేందుకు జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
YS Jagan | కడపపై జగన్ స్పెషల్ ఫోకస్
ఆ మధ్య ఎమ్మిగనూరు నుండి జమ్మలమడుగు, ఇప్పుడు రైల్వేకోడూరు వరకు… ఒక్కో నియోజకవర్గంలో జగన్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్‌కు పవర్‌సెంటర్‌గా పేరున్న కడప జిల్లా (Kadapa District) ప్రాంతంలో ప్రక్షాళన మొదలైందని టాక్ జోరుగా వినిపిస్తోంది. రైల్వేకోడూరు (Railway Kodur) వైసీపీకి కీలక నియోజకవర్గం. వరుసగా మూడు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు 2024లో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ చేతిలో పరాజయం చెందడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఓటమి తర్వాత కొరముట్ల నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడం, లోకల్ లెవెల్లో పార్టీ బలహీనమవ్వడం జగన్ (YS Jagan) దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది.
ఇప్పటికే “ఇంచార్జ్ మార్పు”పై ఉన్న ఊహాగానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి (MPP Dhvaja Reddy) పేరు ఇంచార్జ్ రేసులో బలంగా వినిపిస్తోంది. ధ్వజారెడ్డికి జగన్‌తో నేరుగా మంచి అనుబంధం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, స్థానికంగా బలమైన వ్యాపార, నాయకత్వ నెట్వర్క్,గత కొన్ని నెలలుగా అనధికారికంగా నియోజకవర్గ పర్యటనలు, డీలిమిటేషన్ తర్వాత రైల్వేకోడూరు ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్ కేటగిరీకి మారే అవకాశం ఉందని ప్రచారం. అలాంటప్పుడు కొత్త లీడర్‌ను ముందుగానే గ్రౌండ్లోకి దించాలని జగన్ భావిస్తున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. రైల్వేకోడూరులో ఇంచార్జ్ మార్పు దాదాపు ఖాయమని ఇన్సైడ్ టాక్. కొరముట్లను తప్పించి ధ్వజారెడ్డికి బాధ్యతలు ఇస్తే గ్రామ స్థాయి వరకు పార్టీ పునర్నిర్మాణం వేగవంతం అవుతుందని నేతలు భావిస్తున్నారు.