అక్షరటుడే, వెబ్‌డెస్క్: Google Pixel 10a | గూగుల్ మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘(Smart Phone) గూగుల్ పిక్సెల్ 10ఏ’ను రిలీజ్ అయింది. గత మోడల్‌తో పోలిస్తే ఈ ఫోన్లో కొన్ని మార్పులు చేసింది. రూ. 49,999 ధరలో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, గూగుల్ ఇండియా ఆన్లైన్ స్టోర్లలో వచ్చేనెల 6 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..
డిస్ప్లే : 6.3 అంగుళాల పీవోఎలఈడీ డిస్ప్లే అమర్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సామర్థ్యం కలిగి ఉంది. ఐపీ 68 రేటింగ్ ఉంది. ఫ్రంట్, బ్యాక్ రెండువైపులా గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది.
సాఫ్ట్వేర్ : ఇందులో టెన్సర్ జీ4 చిప్సెట్ అమర్చారు. ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. ఏడేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
కెమెరా సెటప్ : 48 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అల్ట్రావైడ్ కెమెరాలో మాక్రో సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 ఎంపీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ : 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ 30డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 10డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ (Wireless charging) ఆప్షన్ కూడా ఉంది.
వేరియంట్ : బెర్రీ, ఫాగ్, లావెండర్, ఒబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.49,999.
కార్డ్ ఆఫర్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.