Homeతాజావార్తలుIndiramma Sarees | మహిళలకు గుడ్​న్యూస్​.. 19న చీరల పంపిణీ

Indiramma Sarees | మహిళలకు గుడ్​న్యూస్​.. 19న చీరల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఈ నెల 19న చీరలు పంపిణీ చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Sarees | రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి సందర్భంగా ఈ నెల 19న మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేయనుంది.

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారు. రేషన్​ కార్డుల్లో పేరున్న ప్రతి మహిళకు ఒక చీర అందించే వారు. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల (Bathukamma sarees) పంపిణీ నిలిపి వేసింది. గత ఏడాది చీరలు ఇవ్వలేదు. అయితే ఈ ఏడాది బతుకమ్మ పండుగకు మహిళా సంఘ సభ్యులకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది.అయితే సకాలంలో చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీని వాయిదా వేసింది.

Indiramma Sarees | ఇందిరా గాంధీ జయంతి రోజు

ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi Jayanti) సందర్భంగా ఈ నెల 19న చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 65 లక్షల మంది మహిళకు చీరలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే చీరల తయారు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. వారం రోజుల్లో మొత్తం చీరల ఉత్పత్తి పూర్తవుతందని అధికారులు తెలిపారు. బీఆర్​ఎస్​ హయాంలో బతుకమ్మ చీరలకు రూ.350 చొప్పున చెల్లించారు. అయితే వాటి నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరకు రూ. 480గా ధర నిర్ణయించింది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంపిణీకి చీరలు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కాగా చీరల తయారీతో నేత కార్మికులకు ఉపాధి లభించింది.

Must Read
Related News