HomeUncategorizedToll Tax | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నో టోల్ ట్యాక్స్..

Toll Tax | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నో టోల్ ట్యాక్స్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Tax | ఎలక్ట్రిక్​ వాహనదారులకు మహారాష్ట్ర maharashtra ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్​ వాహనాల Electric vehiclesకు ఇక టోల్​ఛార్జీలు toll charges వసూలు చేయమని ప్రకటించింది. ఎలక్ట్రిక్​ కార్లు, బస్సులకు టోల్​ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. ముంబయి – పూణె ఎక్స్​ప్రెస్​ వే, ముంబయి–నాగ్​పూర్​ సమృద్ధి ఎక్స్​ప్రెస్​ వే, అటల్​ సేతు మార్గాల్లో ఇక ఎలక్ట్రిక్​ వాహనాలకు టోల్​ ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో సైతం ఎలక్ట్రిక్​ వాహనాలకు 50శాతం టోల్​ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ Devendra Fadnavees ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్​ వాహనాలు పెరిగి కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.