అక్షరటుడే, వెబ్డెస్క్ : Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం కోసం వెళ్తుంటారు. తెలంగాణ నుంచి సైతం భారీగా భక్తులు శ్రీశైలం వెళ్తారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ(TS RTC) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.
శ్రీశైలం క్షేత్రానికి హైదరాబాద్ మీదుగా భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ మేరకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Shamshabad Airport) నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
Srisailam Temple | బోర్డింగ్ పాయింట్ ఏర్పాటు
శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న క్రాస్ రోడ్డు దగ్గర కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విమానాశ్రయం నుంచి పుష్పక్ బస్సుల్లో బోర్డింగ్ పాయింట్ వరకు భక్తులు చేరుకోవచ్చు. అక్కడి నుంచి స్పెషల్ బస్సు(Special Bus)ల్లో శ్రీశైలం వెళ్లొచ్చు. బోర్డింగ్ పాయింట్ నుంచి శ్రీశైలం ఆలయానికి 20 నిమిషాలకో బస్సు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సూపర్ లగ్జరీ, రాజధాని, ఏసీ బస్సులు ఏర్పాటు చేశారు.
Srisailam Temple |భక్తులు వినియోగించుకోవాలి
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం ఆలయానికి(Srisailam Temple) వెళ్లే భక్తులు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మల్లికార్జున స్వామి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది. కాగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి(Srisailam Mallanna Temple) ఇప్పటికే ఆర్టీసీ పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే భక్తుల రద్దీ ఉండే ఆలయాలకు నిత్యం బస్సులు నడుపుతుండటంతో పాటు స్పెషల్ టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆలయాల సందర్శనకు వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.