అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Rates | బంగారం ధరలు రోజుకు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రేట్లు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశీయంగా పసిడి ధరలు(Gold Prices) పరుగులు పెడుతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. దీంతో తమ డబ్బును పసిడిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో గోల్డ్ రేట్లు(Gold Rates) ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడితో పాటు వెండి ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి.
Gold Rates | రూ.1.30 లక్షలు దాటిన పసిడి
నిజామాబాద్ మార్కెట్(Nizamabad Market)లో తులం బంగారం రూ.1.30 లక్షలు దాటింది. మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,32,700గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,22,285 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు కొనలేకపోతున్నారు. వెండి ధరలు(Silver Prices) సైతం పెరుగుతాయని ప్రచారం జరుగుతుండటంతో దానిని కొని పెట్టుకుంటున్నారు. దీంతో సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం కిలో వెండి రూ.రెండు లక్షలు దాటింది. కిలో వెండి నిజామాబాద్ మార్కెట్లో రూ.2,05,000గా ఉంది.