Homeతాజావార్తలుToday Gold Prices | ఇంకాస్త తగ్గిన గోల్డ్ రేట్​.. నేడు బంగారం, వెండి ధ‌ర‌లు...

Today Gold Prices | ఇంకాస్త తగ్గిన గోల్డ్ రేట్​.. నేడు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే…!

Today Gold Prices | బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. బంగారం ధరలు క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ పతనం దిశగా పయనిస్తుండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Prices | బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. బంగారం ధరలు క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ పతనం దిశగా పయనిస్తుండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

దీపావళి Diwali పండుగ ముగిసిన వెంటనే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా తగ్గుతూ, పతన దిశలో సాగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం వరకూ రికార్డు స్థాయికి ఎగ‌బాకిన బంగారం ధరలు ఇప్పుడు వెనక్కి తగ్గడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇటీవల అమెరికా సుంకాల పెంపు, గ్లోబల్ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ పడిపోవడం వంటి అంశాలు బంగారం ధరలను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

అదనంగా దీపావళి సందర్భంగా పెరిగిన డిమాండ్ కూడా గోల్డ్ రేట్లు గగనానికి ఎగసేలా చేసింది. అయితే పండుగ ముగియడంతో పాటు డాలర్ విలువ మళ్లీ పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు లాభాలను ద‌క్కించుకునే ప్రయత్నంలో బంగారం అమ్మకాలకు దిగుతున్నారు.

Today Gold Prices | స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల‌..

ఫలితంగా వరుస సెషన్లలో బంగారం ధరలు Gold Rates గణనీయంగా పడిపోతున్నాయి. ఈ పతనంతో బంగారం కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్టయింది.

ఇక అక్టోబర్ 22 నాటికి గ్లోబల్ మరియు దేశీయ మార్కెట్లలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు (అక్టోబర్‌ 22న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 24 carat gold ధర రూ. 1,30,570గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం 22 carat gold ధర రూ. 1,19,690కు చేరుకుంది.

  • ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,30,720గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,840గా ఉంది.
  • ఇక హైదరాబాద్‌, విజయవాడ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కేరళ Kerala వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,570, 22 క్యారెట్ల ధర రూ. 1,19,690గా కొనసాగుతోంది.
  • వడోదరలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,620, 22 క్యారెట్ల ధర రూ. 1,19,740గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు Silver Prices మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 1,81,900గా ఉంది.

ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,63,900గా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం ఈ పెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.