Homeతాజావార్తలుGold | బంగారం కొంటున్నారా.. ఇవి తెలుసుకోకపోతే పక్కాగా మోసపోతారు..!

Gold | బంగారం కొంటున్నారా.. ఇవి తెలుసుకోకపోతే పక్కాగా మోసపోతారు..!

Gold | బంగారం కొనుగోలు అనేది ఒక పెట్టుబడి, సెంటిమెంట్. ముఖ్యంగా ధన త్రయోదశి, దీపావళి వంటి శుభ సందర్భాలలో, పెళ్లిళ్ల సీజన్‌లో లక్షలాది మంది బంగారం కొంటారు. అయితే, కొనే పసిడి స్వచ్ఛమైనదా.. కాదా.. అని నిర్ధారించుకోవడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్‌మార్క్‌ను తనిఖీ చేయడం తప్పనిసరి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold | బంగారం కొనుగోలు అనేది భారతీయులకు ఒక పెట్టుబడి, సెంటిమెంట్. ముఖ్యంగా ధన త్రయోదశి, దీపావళి వంటి శుభ సందర్భాలలో, అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో లక్షలాది మంది బంగారం కొంటారు.

అయితే, కొనే పసిడి స్వచ్ఛమైనదా.. కాదా.. అని నిర్ధారించుకోవడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను తనిఖీ చేయడం తప్పనిసరి.

స్వచ్ఛతకు ప్రమాణం: Gold క్యారెట్ (Carat) అంటే ఏమిటి?

బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాన్నే క్యారెట్ (Carat) అంటారు. దీనిని 0 నుంచి 24 స్కేల్‌లో లెక్కిస్తారు.

24 క్యారెట్ల (24K) బంగారం: ఇది 99.9% స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉండటం వల్ల, ఆభరణాల తయారీకి అనువుగా, బలంగా మార్చడానికి రాగి, వెండి, నికెల్ వంటి ఇతర లోహాలను కలుపుతారు.

హాల్‌మార్క్ క్యారెటేజ్ Hallmark Caratage: బంగారం స్వచ్ఛత purity ను బట్టి 14K, 18K, 22K లలో హాల్‌మార్కింగ్ ఇస్తారు.

ఉదాహరణ: హాల్‌మార్క్‌లో 22 క్యారెట్లు (లేదా 916) అని ఉంటే, ఆ ఆభరణంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉందని అర్థం.

బీఐఎస్ హాల్‌మార్క్‌లో ఏయే గుర్తులు చూడాలి?

బీఐఎస్ హాల్‌మార్క్ అనేది స్వచ్ఛమైన బంగారానికి లభించే నాణ్యత ప్రమాణ పత్రం. ఇది తప్పనిసరిగా ఆభరణాలపై ఉండాలి. హాల్‌మార్క్‌లో ప్రధానంగా నాలుగు గుర్తులను గమనించాలి:

బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధృవీకరిస్తుంది.

ప్యూరిటీ/క్యారేటేజ్ గ్రేడ్: బంగారం స్వచ్ఛత సంఖ్య (ఉదా: 916 – 22K కోసం, 750 – 18K కోసం).

ఎస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్ (AHC) గుర్తు: ఈ గుర్తు ఆభరణాన్ని పరీక్షించి, ధృవీకరించిన కేంద్రాన్ని సూచిస్తుంది.

నగల వ్యాపారి గుర్తు/సంఖ్య: బీఐఎస్‌ BIS లో నమోదు అయిన ఆభరణాల వ్యాపారి ప్రత్యేక గుర్తింపు చిహ్నం.

వ్యాపారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు:

నాణ్యత విషయంలో పూర్తి సంతృప్తి చెందడానికి ఈ వివరాలను అడగాలి.

బీఐఎస్ లైసెన్స్: క్వాలిటీ విషయంలో సందేహం ఉంటే, వ్యాపారిని వారి బీఐఎస్ లైసెన్స్ చూపించమని అడగవచ్చు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం, కొనుగోలుదారునికి లైసెన్స్‌ను చూపించడం వ్యాపారులకు తప్పనిసరి.

అడ్రస్ ధృవీకరణ: లైసెన్స్‌లో ఉన్న అడ్రస్‌లోనే దుకాణం ఉందా? అనేది సరిచూసుకోవడం మంచిది. చాలా మంది వ్యాపారులు తమ లైసెన్స్‌ను దుకాణాల్లో స్పష్టంగా కనిపించేలా ఉంచుతారు.

బిల్లు, ఛార్జీలు:

బిల్ బ్రేకప్ (Bill Break-up): కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన పూర్తి బిల్లు వివరాలు అడిగి తీసుకోవాలి.

హాల్‌మార్కింగ్ ఛార్జీలు: బిల్లులో హాల్‌మార్కింగ్ కోసం ఎంత ఛార్జీ వేశారో తెలుస్తుంది. హా‌ల్‌మార్కింగ్ చేసిన బంగారు వస్తువులపై AHCలు వ్యాపారి నుంచి ఒక్కో వస్తువుకు రూ. 45 వసూలు చేస్తాయి. వెండి ఆభరణాలకు ఈ ఛార్జీ రూ. 35గా ఉంది.

స్వచ్ఛతపై సందేహాలు ఉంటే ఏం చేయాలి?

మీరు కొన్న బంగారు ఆభరణం స్వచ్ఛతపై సందేహాలుంటే, మీరు స్వయంగా చర్య తీసుకోవచ్చు.

AHC వద్ద తనిఖీ: కొనుగోలుదారులు నేరుగా ఎస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్ (AHC) వద్దకు వెళ్లి, తక్కువ ఛార్జీలతో తమ ఆభరణాలను తనిఖీ చేయించుకునే అవకాశం ఉంది.

రిపోర్ట్: పరీక్షించిన తర్వాత, ఆ ఆభరణం స్వచ్ఛత గురించి AHC అధికారిక రిపోర్టు ఇస్తుంది.

AHC వివరాలు: బీఐఎస్ వెబ్‌సైట్లో నమోదైన AHCల వివరాలు లభిస్తాయి. అలాగే, సస్పెండ్ చేసిన లేదా లైసెన్స్ రద్దు చేసిన వ్యాపారుల వివరాలు కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.

పండుగ సీజన్ అమ్మకాల అంచనా:

దేశంలో పండుగల సీజన్ జోరుగా సాగుతోంది. ట్రేడింగ్ సంస్థల లెక్కల ప్రకారం, ఈ ధన త్రయోదశి సందర్భంగా భారతీయులు ఇప్పటికే రూ. 60,000 కోట్ల విలువైన బంగారాన్నిgold  కొనుగోలు చేశారు.

పసిడి ధరలు 10 గ్రాములకు రూ. 1,35,000 గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో కొనుగోళ్లకు దారితీసింది.

ఈ వివరాలన్నీ దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు చేయడం ద్వారా, పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.