అక్షరటుడే, హైదరాబాద్: Gold and Silver Prices | బంగారం gold ధరలకు కళ్లెం పడినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ (global market) లో వరుసగా 8 వారాల పాటు పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్స్.. తాజాగా ఒక్కసారిగా పడిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ (international market) లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఔన్స్ బంగారం ధర 220 డాలర్లు తగ్గింది. అంటే గోల్డ్ రేట్ 4,122 డాలర్లకు దిగొచ్చింది.
ఈ లెక్కన మన కరెన్సీ (currency) లో రూ.7 వేలు పతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. ఔన్స్ ounce వెండి ధర 3.9 డాలర్లు క్షీణించింది. అంటే 48.39 డాలర్ల వద్ద వెండి ట్రేడ్ అవుతోంది.
బంగారం, వెండి ధరలు ఇంత భారీ స్థాయిలో పతనం కావడం 2013 తర్వాత ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
గత రెండు నెలల నుంచి బంగారం మార్కెట్లో పెరుగుతూ వచ్చిన పెట్టుబడులు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు తాజాగా ప్రాఫిట్ బుకింగ్ వైపు మళ్లినట్లు స్పష్టం అవుతోంది.
Gold and Silver Prices | అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు..
ఇక మరో విషయానికి వస్తే.. భారత్ (India), చైనా (China) పై భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే భారత్, చైనా తమ వద్ద ఉన్న డాలర్ (Dollar) నిల్వలను తగ్గిస్తూ.. గోల్డ్ నిల్వల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చాయి.
ఇలా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా గోల్డ్ gold నిల్వలు పెంచుకుంటూ పోవడంతో గోల్డ్ ధరలు ఎవరూ ఊహించలేనంతగా పెరుగుతూ పోయాయి.
తాజాగా ట్రంప్ వెనక్కి తగ్గడం, సామరస్యపూర్వక ధోరణితో మాట్లాడేందుకు ప్రయత్నించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
మరోవైపు అగ్ర దేశాలైన రష్యా – అమెరికా మధ్య కాస్త సఖ్యత పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.