అక్షరటుడే, హైదరాబాద్: Gold and Silver Prices | బంగారం ధరలకు కళ్లెం పడబోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ (global market) లో వరుసగా 8 వారాల పాటు పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్స్.. తాజాగా ఒక్కసారిగా పడిపోతున్న సంకేతాలు చూపిస్తున్నాయి.
ఒక్కరోజులో పసిడి ధరలో 3% క్షీణత చూపిస్తోంది. 24 క్యారెట్ గోల్డ్ (24 carat gold) ధర 10 గ్రాములకు ఒకేసారి రూ. 1.32 లక్షల నుంచి రూ. 1.25 లక్షలకు పడిపోయింది.
వెండి Silver ధర సైతం ఒక్కరోజులో 8% క్షీణత నమోదు చేసుకుంది. కిలో వెండి రూ. 1.70 లక్షల నుంచి రూ. 1.53 లక్షలకు పడిపోయింది.
పండుగ రోజు అంటే సోమవారం మార్కెట్లో ఈ తగ్గిన ధరల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పండుగ వేళ గోల్డ్ కొనాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.
గత రెండు నెలల నుంచి బంగారం మార్కెట్లో పెరుగుతూ వచ్చిన పెట్టుబడులు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు తాజాగా ప్రాఫిట్ బుకింగ్ వైపు మళ్లినట్లు స్పష్టం అవుతోంది.
Gold and Silver Prices | అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు..
ఇక మరో విషయానికి వస్తే.. భారత్ (India), చైనా (China) పై భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే భారత్, చైనా తమ వద్ద ఉన్న డాలర్ (Dollar) నిల్వలను తగ్గిస్తూ.. గోల్డ్ నిల్వల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చాయి.
ఇలా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా గోల్డ్ gold నిల్వలు పెంచుకుంటూ పోవడంతో గోల్డ్ ధరలు ఎవరూ ఊహించలేనంతగా పెరుగుతూ పోయాయి.
తాజాగా ట్రంప్ వెనక్కి తగ్గడం, సామరస్యపూర్వక ధోరణితో మాట్లాడేందుకు ప్రయత్నించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
మరోవైపు అగ్ర దేశాలైన రష్యా – అమెరికా మధ్య కాస్త సఖ్యత పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూ పోతాయని చెబుతున్నారు.