Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. ఈ మేరకు కందకుర్తి పుష్కర ఘాట్​ను ఆమె బుధవారం సందర్శించారు.

అక్షరటుడే, బోధన్: Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్​ను(Kandakurthi Ghat) కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ప్రధానమైన ఈ పుష్కర ఘాట్​ను క్షేత్రస్థాయిలో సందర్శించారు.

Godavari Pushkaralu Preparations | అధికారులపై ఆగ్రహం..

పుష్కర ఘాట్ వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గోదావరి పుష్కరాలకు ఈ ఘాట్ వద్ద వీవీఐపీలు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను (Temple Affairs Department) ఆదేశించారు.

పార్కింగ్​ సమస్య రాకుండా..

ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలని కలెక్టర్​ పేర్కొన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు.

పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ వంటి వాటికి అవసరమైన మేర మరమ్మతులు చేయించాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, హైమాస్ట్​ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...