ePaper
More
    Homeబిజినెస్​Gift nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Gift nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | యూఎస్‌ మార్కెట్లు(US markets) గురువారం లాభాలతో, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ పాజిటివ్‌గా కొనసాగుతోంది.

    యూఎస్‌ మార్కెట్లు..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.58 శాతం, ఎస్‌అండ్‌పీ 0.32 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.08 శాతం నష్టంతో సాగుతోంది.

    Gift nifty | యూరోప్‌ మార్కెట్లు..

    సీఏసీ(CAC) 0.24 శాతం, లాభాలతో ముగియగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.42 శాతం, డీఏఎక్స్‌ 0.03 శాతం నష్టంతో ముగిశాయి.

    Gift nifty | ఆసియా మార్కెట్లు..

    ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.05 గంటల సమయంలో హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.70 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.55 శాతం, షాంఘై 0.51 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.22 శాతం లాభాలతో ఉండగా.. నిక్కీ 0.45 శాతం, కోస్పీ 0.17 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.18 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజూ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Gift nifty | గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 3,856 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు మూడోరోజూ నికరంగా రూ. 6,920 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.72 నుంచి 0.86 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.12 శాతం తగ్గి 12.18 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.80 శాతం తగ్గి 67.44 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 87.62 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.22 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.99 వద్ద కొనసాగుతున్నాయి.
    • భారత ఎగుమతులతో యూఎస్‌ అదనపు సుంకాలు 50 శాతానికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ఎగుమతి ఆధారిత కంపెనీలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
    • యూఎస్‌ జీడీపీ వార్షిక వృద్ధి రేటు పెరిగింది. రెండో త్రైమాసికంలో 3.1 శాతం ఉంటుందని అంచనా వేయగా 3.3 శాతం పెరిగింది.
    • యూఎస్‌ ఉద్యోగ రహిత క్లెయిమ్‌ల కోసం దరఖాస్తులు గతవారం అంచనాలకన్నా తగ్గాయి. ఆగస్టు 23తో ముగిసిన వారానికి 5 వేల దరఖాస్తులు తగ్గి 2.29 లక్షల వద్ద ఉన్నాయి. 2.30 లక్షల దరఖాస్తులు వస్తాయని రాయిటర్స్‌ అంచనా వేసింది.
    • జూలైలో భారతదేశ తయారీ రంగంలో మంచి పనితీరు కనిపించింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.5 శాతం పెరిగి నాలుగు నెలల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపీ) గతేడాది జూలైతో పోల్చితే 5 శాతం, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో 2.3 శాతం పెరిగింది. అయితే ఇది గతేడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువే కావడం గమనార్హం.

    Latest articles

    Manjira River | తగ్గిన వరద ఉధృతి.. క్షేమంగా విద్యార్థులను తరలించిన అధికారులు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Manjira River | ఉమ్మడి మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత...

    US Vice President | అవ‌స‌ర‌మైతే అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రిస్తా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Vice President | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పోటెత్తిన వరద.. 39 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల విడుదల

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు వరద పోటెత్తింది. ఉమ్మడి మెదక్​, నిజామాబాద్​ జిల్లాల్లో కురిసిన...

    Weather Updates | నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద ముంచెత్తింది. మూడు రోజులుగా కురుస్తున్న...

    More like this

    Manjira River | తగ్గిన వరద ఉధృతి.. క్షేమంగా విద్యార్థులను తరలించిన అధికారులు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Manjira River | ఉమ్మడి మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత...

    US Vice President | అవ‌స‌ర‌మైతే అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రిస్తా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Vice President | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పోటెత్తిన వరద.. 39 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల విడుదల

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు వరద పోటెత్తింది. ఉమ్మడి మెదక్​, నిజామాబాద్​ జిల్లాల్లో కురిసిన...