Global markets | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు
Global markets | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Global markets | లాంగ్‌ వీకెండ్‌ తర్వాత సోమవారం స్టాక్‌ మార్కెట్లు(Stock markets) ప్రారంభం కాబోతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌(Mixed)గా ట్రేడ్‌ అవుతున్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో యూఎస్‌కు చెందిన నాస్‌డాక్‌ 0.13 శాతం నష్టంతో ముగియగా.. ఎస్‌అండ్‌పీ 0.13 శాతం లాభపడింది. డౌజోన్స్​ ఫ్యూచర్స్‌(Dow Jones Future) 0.77 శాతం నష్టంతో కొనసాగుతోంది.

Global markets | ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన

ఆసియా మార్కెట్లు(Asia markets) మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. జపాన్‌, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు నష్టాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్స్‌ టైమ్స్‌, చైనాకు చెందిన షాంఘై(Shanghai) లాభాలతో కదలాడుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నిక్కీ 1.25 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. కోస్పీ ఫ్లాట్‌గా ఉండగా.. స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 1.22 శాతం, షాంఘై 0.40 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.13 శాతం లాభంతో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

READ ALSO  Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Global markets | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు మూడు ట్రేడింగ్‌ సెషన్లుగా నెట్‌ బయ్యర్లుగా కొనసాగుతున్నాయి. గురువారం నికరంగా రూ. 4,667 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐ(DII)లు మాత్రం వరుసగా మూడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచి, రూ. 2,006 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

మార్కెట్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌(Bullish trend) కొనసాగుతోంది. పుట్‌ కాల్‌ రేషియో 0.98 నుంచి 1.17 శాతానికి చేరింది. వరుసగా నాలుగో సెషన్‌లోనూ విక్స్‌(వొలటాలిటీ ఇండెక్స్‌) తగ్గింది. చివరి సెషన్‌లో 2.51 శాతం తగ్గి 15.47 వద్ద ఉంది. క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 1.70 శాతం తగ్గి 63.58 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారం(Gold), వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్‌(Dollar index) 0.40 శాతం తగ్గి 98.39 వద్ద కొనసాగుతోంది. యూఎస్‌ (US) 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.21 శాతం పెరిగి 4.33 వద్ద ఉంది. రూపాయి విలువ బలపడుతోంది. డాలర్‌తో 32 పైసలు లాభపడి 85.37 వద్ద ఉంది.

READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం