అక్షరటుడే, వెబ్డెస్క్: Ganesh Laddu | వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi celebrations) ఘనంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
మండపాల్లో పూజలు అందుకున్న గణనాథుడిని భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను మండపాల నిర్వాహకులు వేలం వేస్తున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు వినాయకుడి లడ్డూలను దక్కించుకోవడం కోసం భక్తులు ఏటా ఉత్సాహం చూపుతుంటారు. ఈ క్రమంలో పలు చోట్ల గణేశుడి లడ్డూ (Ganesha laddus) రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది.
Ganesh Laddu | మై హోమ్ భూజాలో..
నగరంలోని మైహోమ్ భుజాలో (My Home Bhuja) వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.51.77 లక్షలు పలికింది. కొండపల్లి గణేష్ అనే వ్యక్తి వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో భారీ ధర పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ రూ.29.5 లక్షలు పలికింది.
Ganesh Laddu | భక్తుల నమ్మకం
వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను వేలంలో దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. దీంతో లడ్డూ కోసం పోటీ పడి వేలం పడుతారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రూ.లక్షల వరకు వేలం సాగుతోంది. గతంలో హైదరాబాద్లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesha Laddu) రికార్డు ధర పలికేది. ఈ లడ్డూ కోసం చాలా మంది పెద్ద పెద్ద నేతలు, వ్యాపారులు పోటీ పడుతారు. అయితే కొన్నేళ్లుగా గేటేడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన గణనాథుల చేతిలోని లడ్డూలు కూడా భారీ ధర పలుకుతున్నాయి.