అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.
వినాయక మండపాలల్లో (Vinayaka mandapalu) భక్తులు పదకొండురోజులు వినాయకుడికి భక్తితో పూజలు చేశారు. అనంతరం ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. శోభాయాత్రలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ముందుకు కదిలాయి.
ప్రభుత్వ శాఖలన్నీ ఏకతాటిపై..
ముఖ్యంగా..రెవెన్యూ (Revenue Department), పోలీస్ (Police Department), విద్యుత్తు, మున్సిపల్, ఫైర్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో పనిచేశారు. దీంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కార్యక్రమానికి సహకరించిన వినాయక మండపాల నిర్వాహకులకు, భక్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.