అక్షరటుడే, గాంధారి: Gandhari | పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నేపథ్యంలో గాంధారి మండలంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో శనివారం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన బందోబస్తు గురించి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
Gandhari | అదనపు బలగాల రాక..
ఎన్నికల సందర్భంగా గాంధారిలో (Gandhari) అదనపు బలగాలను దింపారు. అలాగే 200 మంది పోలీసు బలగాలతో పాటు ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు విధుల్లో ఉన్నట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు. ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను ఏర్పాటు చేశామని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. గాంధారి, గండివేట్, పోతంగల్, గౌరారం, సీతాయపల్లి వద్ద ప్రత్యేక బలగాలు ఉంటాయని తెలిపారు.