7
అక్షరటుడే, మెండోరా : Mendora | అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెల్గటూర్ పెద్దవాగు (Velgatur Peddavagu) నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను మెండోరా పోలీసులు (Mendora Police) పట్టుకున్నారు.
ఉదయం 7 గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ సుహాసిని (SI Suhasini) ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపారు. ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్ యజమానులు అల్లెపు లింబాద్రి, పెనుగొండ శ్రీనివాస్, వేముల రామరాజు, ఓర్సు శ్రీనివాస్‌పై కేసులు పెట్టారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.