అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Police | గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కిలోలకుపైగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న (CI Swapna) ఆధ్వర్యంలో నగరంలోని అర్సపల్లి (Arsapally) వద్ద తనిఖీలు చేపట్టారు.
అర్సపల్లిలోని ఎన్‌ఎన్ ప్యాలెస్ వద్ద ఓ కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) బహదూర్ పురాకు (Bahadurpura) చెందిన మహమ్మద్ మునావర్, బాలాపూర్‌నకు (balapur) చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, చాంద్రాయణ గుట్టకు (Chandrayan Gutta) చెందిన అమీర్ పాషా, నగరంలోని ముజాయత్ నగర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 2.100 గ్రాముల ఏండు గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను విచారణ నిమిత్తం నిజామాబాద్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. దాడుల్లో సీఐ స్వప్న, ఎస్సైలు రామ్‌కుమార్, చారి సిబ్బంది హమీద్, శివ, రాజన్న, భూమన్న, ఆశన్న, రాంబచ్చన్, సాయిప్రసాద్ పాల్గొన్నారు.