- Advertisement -
HomeతెలంగాణBRS | బీఆర్​ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

BRS | బీఆర్​ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | సిర్పూర్​ కాగజ్​ నగర్​ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru Konappa) మళ్లీ సొంత గూటికి చేరారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

కోనేరుకు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ (BSP) నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన బీఆర్​ఎస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో సైతం బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. అయితే బీజేపీ (BJP) అభ్యర్థి పాల్వాయి హరీశ్​ చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

- Advertisement -

BRS | ఆర్​ఎస్​ ప్రవీణ్​పై కోపంతో..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ బీఎస్పీ నుంచి కాగజ్​నగర్​లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హరీశ్​బాబుకు 63,702 ఓట్లు రాగా.. కోనప్పకు 60,614 ఓట్లు వచ్చాయి. ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ 44,646 ఓట్లు సాధించారు. అనంతరం ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ బీఆర్​ఎస్​లో చేరిన విషయం తెలిసిందే. ఆయన పోటీ చేయడంతోనే తాను ఓడానని ఆగ్రహంగా ఉన్న కోనప్ప ప్రవీణ్​కుమార్​ బీఆర్​ఎస్​లో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పార్లమెంట్​ ఎన్నికలకు ముందు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్​ (Congress)లో చేరారు.

BRS | పార్టీపై అసంతృప్తితో..

అధికార పార్టీలో చేరిన కోనప్ప కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు సమక్షంలో ఆయన బీఆర్​ఎస్​లో చేరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News