అక్షరటుడే, వెబ్‌డెస్క్: Forest Officer | వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ శాఖ అధికారే (Forest Officer) దారి తప్పాడు. ఉద్యోగ ధర్మాన్ని మరిచి వన్యప్రాణులను వేటాడాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా బాపన్ పహాడ్ సమీపంలోని అడవిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) హనుమంతు ఉడుములను వేటాడాడు. మరో వ్యక్తి సహాయంతో వాటిని వెంట తీసుకొస్తున్న టైంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కంటపడ్డాడు. దీంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీట్ ఆఫీసర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Forest Officer | ఎప్పటి నుంచో ఆరోపణలు
కాగా.. అడవులను, అటవీ జంతువులను రక్షించాల్సిన కొందరు ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతేగాకుండా పలువురు అధికారులు డబ్బులు తీసుకొని ఫారెస్ట్ భూముల కబ్జాపై పట్టించుకోవడం లేదు. ఇలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను అధికారులు శనివారం సస్పెండ్ చేశారు. తాజాగా ఓ బీట్ ఆఫీసర్ ఏకంగా ఉడుములను వేటాడటంపై వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాల్సిన అధికారులే వేటాడితే.. అటవీ జంతువులకు రక్షణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.