Ceasefire | విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్​.. ఖండించిన అధికారులు
Ceasefire | విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్​.. ఖండించిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ceasefire | విక్రమ్​ మిస్రీ vikram misri.. మొన్నటి వరకు ఎవరికి అంతగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిచితం. ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ నిత్యం మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టిన తీరు గురించి ఆయన కల్నల్​ సోఫియా ఖురేషి sofia khureshi, వింగ్​ కమాండ్​ వ్యోమికా సింగ్​ vyomika singhతో కలిసి ఆయన బ్రీఫింగ్​ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలు, రక్షణ చర్యలను ఆయన వివరించారు. అయితే మిస్రీతో పాటు ఆయన కుటుంబాన్ని ప్రస్తుతం కొందరు ట్రోలింగ్​ చేస్తున్నారు. దీనిని ఐఏఎస్, ​ఐపీఎస్​ అసోసియేషన్లు​ తీవ్రంగా ఖండించాయి.

Ceasefire | సీజ్​ఫైర్​ అనౌన్స్​ చేయడంతో..

ఆపరేషన్​ సిందూర్​ అనంతరం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాక్​ డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో భారత్​పై దాడులకు యత్నించింది. అయితే భారత రక్షణ వ్యవస్థ indian defence system పాక్​ దాడులను తిప్పికొట్టింది. అనంతరం భారత్​ ప్రతిదాడులు చేసి దాయాది దేశానికి భారీ నష్టం చేకూర్చింది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణ ceasefire కు అంగీకరించాయి. కాల్పుల విరమణకు అంగీకరించిన విషయాన్ని విక్రమ్​ మిస్రీ మీడియాకు వెల్లడించారు. దీంతో ఆయనను కొందరు ట్రోల్​ చేస్తున్నారు.

Ceasefire | కుటుంబ సభ్యులపై కూడా..

సీజ్​ఫైర్​ నిర్ణయం వివరాలు ప్రకటించినందుకు కొందరు విదేశాంగ కార్యదర్శి విక్రమ్​మిస్రీని ట్రోల్​ చేస్తున్నారు. భారత్​ యుద్ధం చేసి పాక్​ పని పట్టకుండా ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారంటూ ట్రోల్​ చేస్తున్నారు. సీజ్‌ఫైర్‌ను ప్రకటించిన పాపానికి, మిస్రీతో పాటు ఆయన కుమార్తెపై కూడా సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఆయన కుమార్తె ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పెట్టి మరీ ట్రోలింగ్​ చేశారు. దీంతో మిస్రీ తన ట్విటర్ ఖాతాను లాక్ చేసుకున్నారు.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన అధికారిని ట్రోల్​ చేయడాన్ని ఐఏఎస్, ఐపీఎస్​ అసోసియేషన్లు​ తీవ్రంగా ఖండించాయి. మిస్రీతో పాటు ఆయన ఫ్యామిలీపై జరిగిన వ్యక్తిగత దాడుల్ని తప్పు పట్టింది. తమ విధులకు కట్టుబడి ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారిపై ఇలాంటి దాడులు సరికావని పేర్కొంది. పలువురు అధికారులు మిస్రీకి మద్దతుగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.