అక్షరటుడే, ఇందూరు: Food safety rule compliance | ఆహార భద్రతా (Food safety) నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(Food Safety Officer) నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని (Nizamabad City) కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లను (Fast food centers), హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.
Food safety rule compliance | హోటళ్లు పరిశుభ్రత పాటించాలి..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్(Testing salt), కృత్రిమ రంగుల(Artificial colors) వాడుతున్నట్లు గమనించామన్నారు. ప్రతి హోటల్లో పరిశుభ్రత పాటించాలని, నిబంధనల మేరకు ఆహార పదార్థాలు వినియోగించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యజమానులకు తగు సూచనలు చేశామన్నారు.
