Homeబిజినెస్​Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది. ఈ వారం స్వల్ప లాభాలతో ముగిసింది. ట్రంప్‌, పుతిన్‌ భేటీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు(Investors) ఆచితూచి వ్యవహరించారు. దీంతో మార్కెట్‌ రోజంతా స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగింది. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 86 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా కొద్దిసేపటికి 136 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత పుంజుకుని 262 పాయింట్లు పెరిగింది. 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) అక్కడినుంచి 69 పాయింట్లు పెరిగింది. రోజంతా సెన్సెక్స్‌ 80,489 నుంచి 80,751 పాయింట్ల మధ్య, నిఫ్టీ 24,596 నుంచి 24,673 పాయింట్ల మధ్య కదలాడిరది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 57 పాయింట్ల లాభంతో 80,597 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 24,631 వద్ద స్థిరపడ్డాయి.

అడ్వాన్సెస్‌, డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,742 కంపెనీలు లాభపడగా 2,320 స్టాక్స్‌ నష్టపోయాయి. 153 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 122 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 106 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 1.67 కోట్లు తగ్గింది.

మెటల్‌, ఎనర్జీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎనర్జీ(Energy) స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురవగా.. కన్జూమర్‌ డ్యూరెబుల్‌, ఐటీ రంగాలలో కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 0.82 శాతం పెరగ్గా.. ఐటీ ఇండెక్స్‌(IT index) 0.45 శాతం బ్యాంకెక్స్‌ 0.23 శాతం లాభపడ్డాయి. మెటల్‌ ఇండెక్స్‌ 1.41 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 1.18 శాతం, ఎనర్జీ 1.02 శాతం, రియాలిటీ 0.76 శాతం, కమోడిటీ 0.73 శాతం, యుటిలిటీ 0.64 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.57 శాతం, పీఎస్‌యూ 0.56 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు 0.55 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.59 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.18 శాతం నష్టపోగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో, 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్‌ 1.94 శాతం, ఇన్ఫోసిస్‌ 1.50 శాతం, ఆసియా పెయింట్‌ 1.16 శాతం, టైటాన్‌ 0.65 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.61 శాతం లాభాలతో ముగిశాయి.

Top Losers : టాటా స్టీల్‌ 3.03 శాతం, టెక్‌ మహీంద్రా 1.53 శాతం, అదాని పోర్ట్స్‌ 1.34 శాతం, బీఈఎల్‌ 1.02 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.80 శాతం నష్టపోయాయి.

Must Read
Related News