HomeతెలంగాణHarish Rao | ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నగరంలో వరదలు.. హరీశ్​రావు ఆగ్రహం

Harish Rao | ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నగరంలో వరదలు.. హరీశ్​రావు ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | హైదరాబాద్​లో భారీ వర్షాలు, మూసీ నదికి వరద పోటెత్తడంపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నగరం నీట మునిగిందని మండిపడ్డారు.

తీవ్ర వర్షాలు ఉంటాయి అని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని హరీశ్​రావు (Harish Rao )ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం నెలకొందనన్నారు. దీంతోనే నగరం జల దిగ్బంధంలో చిక్కుకుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao | బురద రాజకీయాలు మానుకోవాలి

మూసీ నది(Musi River) ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని హరీశ్​రావు సూచించారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి, వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలని సూచించారు. ముసీ పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Harish Rao | అండగా నిలవాలి

హైదరాబాద్‌ మూసీ వరదలపై ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) స్పందించారు. మూసీ వరదలో ఎంజీబీఎస్‌ పరిసరాలు నీట మునిగాయన్నారు. వరద బాధితులకు అండగా నిలవాలని జనసేన పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

Must Read
Related News