అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఆదివారం ఉదయం వరద గేట్లను మూసి వేశారు.
ఎస్సారెస్పీలోకి నిన్నటి వరకు ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో అధికారులు వరద గేట్ల ద్వారా గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేశారు. అయితే ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆదివారం గేట్లను మూసివేశారు. జలాశయంలోకి ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీలతో నిండుకుండలా ఉంది.
Sriram Sagar | నిజాంసాగర్‌లోకి..
అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizam sagar)లోకి ప్రస్తుతం స్వల్ప ఇన్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి 5,760 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు ఒక గేటు ఎత్తి 5,497 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం అంతే నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.

