అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా నీటి విడుదలను సైతం తగ్గించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం స్వల్పంగా ఇన్‌ఫ్లో(Inflow) వస్తోంది.
ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 41,867క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగులకు చేరింది.
Sriram Sagar | నాలుగు గేట్లు ఎత్తివేత
ప్రాజెక్ట్‌లోకి వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం 8 గేట్ల ద్వారా గోదావరి(Godavari)లోని నీటిని వదిలిన అధికారులు సోమవారం నాలుగు గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా 12,320 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | కాలువల ద్వారా..
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఆయకట్టు కింద సాగు అవుతున్న పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha)కు 231క్యూసెక్కులు వదులుతుండగా, 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది.
గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్మించిన వరద కాలువకు 20 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు(Mid Maneru)కు నీటిని తరలిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద కాలువతో పాటు గాయత్రి పంప్‌హౌస్ ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కాలువ ద్వారా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి 10 వేల క్యూసెక్కులు, ప్యాకేజీ –10 అనంతగిరి 9,600 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
ఎస్సారెస్పీ నుంచి వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి(Project AEE Kotha Ravi) సూచించారు. ప్రాజెక్ట్ నుంచి మొత్తం 41,867 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అవుతోందన్నారు. నదిలో, కాలువల్లో చేపల వేటకు, స్నానానికి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.