అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ ఏటా జనవరిలో గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ప్రత్యేక సేల్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది సైతం ప్రత్యేక ఆఫర్లతో వస్తోంది. జనవరి 17 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే సేల్ అందుబాటులో ఉండనుంది.
రిపబ్లిక్ డే సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈజీ ఈఎంఐపైనా ఆఫర్ వర్తించనుంది.కాగా సేల్ ముగింపు తేదీని సంస్థ ప్రకటించలేదు. ఇంకా ఆఫర్లనూ రివీల్ చేయలేదు. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్స్ (Flipkart Special Sales)లో భాగంగా స్మార్ట్‌ఫోన్ (Smartphone)లతోపాటు ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్స్, వాషింగ్ మిషన్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తుంటుంది. ఏయే ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్ ఉంటుందన్న వివరాలను మాత్రం ఇంకా వెల్లడిరచలేదు. సేల్ డేట్ సమీపిస్తున్నందున త్వరలోనే ఆఫర్లను వెల్లడిరచే అవకాశాలున్నాయి.