అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Online Shopping | ఆన్‌లైన్‌లో షాపింగ్ (Online shopping) చేయాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. భారీ ఆఫర్లతో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు స్పెషల్ డేస్‌ను (Special days) ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఇంకా తేదీలను ప్రకటించలేదు. అయితే రెండో వారంలో రెండింటిలోనూ ఒకేసారి సేల్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
దసరా పండుగ సీజన్ సమీపిస్తుండడంతో అందరూ షాపింగ్‌పై దృష్టి సారిస్తారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఇ-కామర్స్ (ecommerce) దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ (Flipkart), గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరిట అమెజాన్ (Amazon) స్పెషల్ షాపింగ్ డేస్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో పలు ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు వంటి విభాగాలలో భారీ డిస్కౌంట్‌లు అందించనున్నట్లు పేర్కొంటున్నాయి.
Online Shopping | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు (Big billion days sale) సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో టీజర్‌ను విడుదల చేసింది. సేల్ తేదీని ప్రకటించాల్సి ఉంది. గతేడాది సెప్టెంబర్ 27న బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈసారి సుమారు రెండు వారాల ముందే సేల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సేల్‌లో ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వంటి ప్రొడక్ట్స్‌పై ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. పీసీలు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు కూడా తక్కువ ధరకు లభించే అవకాశాలున్నాయి.
Online Shopping | కార్డ్ ఆఫర్లు..
స్పెషల్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ యాక్సెస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో (ICICI Bank) ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10శాతం వరకు తక్షణ రాయితీ లభించనుంది. నోకాస్ట్ ఈఎంఐ, యూపీఐ (UPI) ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, పేలేటర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు సూపర్‌కాయిన్స్ ద్వారా ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసేవారికి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
Online Shopping | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు (Great Indian festival sale) ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా యాపిల్, శాంసంగ్, ఐకూ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌పీ, శాంసంగ్, సోనీ, బోట్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, గృహోపకరణాలపై 65 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. సోనీ, శాంసంగ్, ఎల్జీ, షావోమీ స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు 65 శాతం వరకు తక్కువ ధరకు విక్రయించనున్నారు.
Online Shopping | కార్డ్ ఆఫర్లు..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్ ఎస్‌బీఐతో (SBI) ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లబించనుంది. ఐసీఐసీఐ అమెజాన్‌పే క్రెడిట్‌కార్డుతో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.