అక్షరటుడే, కమ్మర్పల్లి: Kamamrpally | మండలంలోని కోనాపూర్ ఉన్నత పాఠశాల స్వచ్ఛహరిత విద్యాలయ 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు పాఠశాల హెచ్ఎం చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, వాన నీటి సంరక్షణ (Rainwater conservation), మరుగుదొడ్లు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో పరిశుభ్రత అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్లాస్టిక్ నిషేధం, కిచెన్ గార్డెన్ (Kitchen garden), పాఠశాల ఎకో క్లబ్ ఏర్పాటు (School Eco Club Formation), కంపోస్ట్ ఎరువు తయారీ, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ ప్రశ్నావళి ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు. 125 మార్కులకు ఇందుకు కోనాపూర్ పాఠశాలకు (Konapur School) 115 మార్కులు రావడంతో 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
