ePaper
More
    Homeక్రైంSHE Team | బోనాల పండుగలో ఆకతాయిల వికృత చేష్టలు.. ఐదుగురికి జైలుశిక్ష

    SHE Team | బోనాల పండుగలో ఆకతాయిల వికృత చేష్టలు.. ఐదుగురికి జైలుశిక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SHE Team | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో బోనాల పండుగ (Bonalu Festival)ను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే బోనాల సందర్భంగా ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళలను అసభ్యంగా తాకడం, వేధింపులకు పాల్పడటం, ఈవ్​ టీజింగ్​ (Eve teasing) చేశారు. అయితే అలాంటి వారి ఆటలను షీ టీమ్​ పోలీసులు కట్టించారు. బోనాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 644 మందిని అరెస్ట్​ చేశారు.

    SHE Team | రెచ్చిపోతున్న పోకిరీలు

    కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. మహిళలు కనిపిస్తే వారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్​లు, రైల్వే స్టేషన్​ల వంటి రద్దీ ప్రాంతాలతో పాటు పండుగలు, జాతరల సమయంలో తమను ఎవరు చూడటం లేదని మహిళలను అనవసరంగా తాకుతున్నారు. అంతేగాకుండా పలువురు ఈవ్​ టీజింగ్​కు పాల్పడుతున్నారు. బోనాల సందర్భంగా ఇలా వ్యవహరించిన 644 మందిని షీ టీమ్​ పోలీసులు పట్టుకున్నారు. వారిలో 92 మంది మైనర్లు ఉండటం గమనార్హం. వీరిలో ప​లువురికి పోలీసులు కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించారు. ఐదుగురిని కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి ఏడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.

    SHE Team | షీ టీమ్​ వాచింగ్​ యూ

    రద్దీ ఉండే ప్రాంతాల్లో మహిళలను ఆకతాయిలు అసభ్యంగా తాకుతున్నారు. తమను ఎవరూ చూడటం లేదనే భావనలో మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అయితే షీ టీమ్ (She Team)​ పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో ఉండి ఆకతాయిలను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు.

    SHE Team | జాగ్రత్తగా ఉండాలి

    పబ్లిక్​ ప్లేస్​ల్లో జాగ్రత్తగా ఉండాలని షీ టీమ్​ పోలీసులు మహిళలకు సూచిస్తున్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా డయల్​ 100 లేదా, 112 నంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు. వాట్సాప్​ నంబర్​ 9490616555 కు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సోషల్​ మీడియా (Social Media)లో సైతం మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ ఖాతాలతో కొందరు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సోషల్​ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు ఎక్కువగా షేర్​ చేయొద్దని సూచించారు.

    More like this

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట...

    America | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ సన్నిహితుడు చార్లి కిర్క్...