అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | జిల్లాలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం రాత్రి వరకు కూడా నామినేషన్లు (Nominations) స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు వేయడానికి గడువు ఉంటుంది.
అయితే చివరి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారందరికి అవకాశం కల్పించారు. దీంతో రాత్రి వరకు ప్రక్రియ సాగింది. బోధన్ డివిజన్లోని (Bodhan Division) 11 మండలాల 184 గ్రామపంచాయతీ, 1,642 వార్డు స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ (Sarpanch) స్థానాలకు 1,167 మంది, వార్డు స్థానాలకు 3,533 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజు సర్పంచ్‌కు 863, వార్డు స్థానాలకు 3,151 నామినేషన్లను అందజేశారు. కాగా డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది.