Homeజిల్లాలుహైదరాబాద్AIG Hospital | గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

AIG Hospital | గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :AIG Hospital | హైదరాబాద్ (Hyderabad City)​ నగరంలోని గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆస్పత్రిలో శనివారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఆస్పత్రిలోని గ్రౌండ్​ ఫ్లోర్​లో ఎమర్జెన్సీ విభాగం (Emergency department) వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అంబులెన్స్( Ambulance)​ కాలిబూడిద అయింది. వాహనం నుంచి పొగలు రావడంతో రోగులు, రోగుల బంధువులు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.