More
    Homeఆంధ్రప్రదేశ్​Andhra Pradesh | బ‌స్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మ‌హిళ‌లు.. వైర‌ల్‌గా మారిన వీడియో

    Andhra Pradesh | బ‌స్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మ‌హిళ‌లు.. వైర‌ల్‌గా మారిన వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరిగిన సంగతి తెలిసిందే.

    అయితే, ఈ పథకం అమలయ్యాక బస్సుల్లో సీట్ల కోసం గొడవలు, వాగ్వాదాలు, కొట్టుకునే ఘటనలు తరచుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ జిల్లాలోని (NTR District) పెనుగంచిప్రోలులో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకొని పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులోకి (118 నంబర్) చాలా మంది మ‌హిళ‌లు ఎక్కారు. అయితే వారిలో కొంద‌రి మ‌ధ్య‌ ఘర్షణ చోటుచేసుకుంది.

    Andhra Pradesh | మ‌హిళ‌ల ఫైటింగ్..

    ఈ బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిలో చాలామంది మహిళలే. సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం, తీవ్రంగా మారి, అసభ్య పదజాలం, తిట్లు, చివరికి నీళ్ల సీసాలతో పరస్పర దాడులు చేసుకునే వ‌రకు వెళ్లింది. ఈ గొడవతో మిగ‌తా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కానీ డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు తీసుకెళ్లడంతో, వారు మండిపడ్డారు. బస్సు నందిగామ (Nandigama) సమీపంలోని మునగచర్ల అడ్డురోడ్డు వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో గొడ‌వ కాస్త శాంతించింది.

    ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. మహిళల మధ్య జరిగిన గొడవపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ప్రారంభించిన విధానం సరైనదా? నిర్వహణ లోపం ఉందా? అనే చర్చకు తెరలేపారు.

    అయితే స్త్రీ శక్తి పథకం (Stree Shakti Scheme) అమలయ్యాక ఆర్టీసీ బస్సుల్లో మహిళల రాకపోకలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తిరుపతమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, బస్సులుఫుల్ అవుతున్నాయి.ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న అసౌకర్యాల నేపథ్యంలో, ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులు నడపాలని కోరుతున్నారు.

    More like this

    Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ కొత్త ఫీచ‌ర్స్ గురించి మీకు తెలుసా.. ఈ ఆప్ష‌న్‌తో బ్యాక్‌గ్రౌండ్ మార్చేయ‌వ‌చ్చు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఓ...

    Stock Market | ఫ్లాట్‌గా సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | కీలకమైన యూఎస్‌ ఫెడ్‌ సమావేశాల ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు....

    Odisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము పిల్లలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కాకత్‌పూర్(Kakatpur) ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి...