Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope రాశులవారికి ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మరికొందరికి మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అవేంటో రాశుల వారీగా తెలుసుకుందాం. మేష రాశి: Feb 26 Zodiac signs | వ్యక్తిత్వం బాగుంటుంది. ఆర్థికంగా అకస్మాత్తుగా డబ్బులు రావడంతో తక్షణ ఖర్చులు తీరిపోతాయి. ఇంటి విషయాలకు ఇది అనుకూలమైన రోజు. పెండింగ్​ పనులు పూర్తి […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope రాశులవారికి ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మరికొందరికి మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అవేంటో రాశుల వారీగా తెలుసుకుందాం.
మేష రాశి: Feb 26 Zodiac signs | వ్యక్తిత్వం బాగుంటుంది. ఆర్థికంగా అకస్మాత్తుగా డబ్బులు రావడంతో తక్షణ ఖర్చులు తీరిపోతాయి. ఇంటి విషయాలకు ఇది అనుకూలమైన రోజు. పెండింగ్​ పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ బంధ జీవితంలో చోటుచేసుకున్న చిన్నచేదు గొడవలను వదిలేయండి. సీనియర్లు, సహోద్యోగుల నుంచి సపోర్టు లభిస్తుంది. అది నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతుంది. బంధువులందరికీ దూరంగా ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. అల్లరిచిల్లర చేష్టలతో టీనేజీ రోజులను నేడు భాగస్వామి గుర్తుచేయనుంది.
వృషభ రాశి: Feb 26 Zodiac signsమీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందేలా ఉంటుంది. చాలా మంది మాటలతో పొగుడుతారు. కుటుంబ సభ్యులని బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ మోసం చేయవచ్చు. బిజినెస్ లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, వేడుకలు ఇంట్లో నిర్వహిస్తారు. వైవాహిక జీవితం తాలూకు గోప్యమైన విషయాన్ని బంధువులు, కుటుంబీకుల మధ్య ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు.
మిథున రాశి: Feb 26 Zodiac signs | అత్యంత ధైర్యం, బలం ప్రదర్శించ వలసి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వ్యథలను అనుభవించి ఉన్నారు. అయినా సానుకూల దృక్పథంతో వాటిని అధిగమించగలరు. ఈరోజు, స్త్రీలు పురుషుల ద్వారా.. పురుషులు స్త్రీల సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తాయి. ఈ రోజును భాగస్వామితో గడుపుతారు.
కర్కాటక రాశి: Feb 26 Zodiac signs | పెళ్లి అయినవారు తమ ధనాన్ని పిల్లల చదువు కోసం ఖర్చుపెట్టవలసి ఉంటుంది. శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు. కానీ, భాగస్వాములతో చేతులు కలిపే ముందు ఆలోచించాలి. జీవిత భాగస్వామి చర్య వల్ల ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికేనని ఆ తర్వాత గ్రహిస్తారు.
సింహ రాశి: ఇతరుల దగ్గర అప్పు తీసుకున్నట్టయితే వారికి తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్ధిక పరిస్థితిని నీరస పరుస్తుంది. సామాజిక కార్యక్రమాలు మంచి పరపతి, ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి. మీ ప్రేమ చిరునవ్వుతో మొదలవుతుంది. ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. పనిలో ప్రశంసలు రావచ్చు. జీవిత భాగస్వామి మైమరింపించే అనుభూతిని ఈ  రోజు పొందనున్నారు.
కన్యా రాశి: ఇవి బాగుంటాయని మీరు ఏవైతే భావిస్తారో వాటిని చేయడానికి ఇది అత్యుత్తమమైన రోజు. ధనలాభాలు అనుకున్నంతగా రావు. ప్రేమ, స్నేహం బంధం ఎదుగుతాయి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఈరోజు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు. మీరు తప్పు అని నిరూపించడానికి ఒకరు ఎదురుచూస్తున్నారు. మీకు బాగా కావలసినవారికి సమయము కేటాయించటం నేర్చుకోండి. ఈ రోజు భాగస్వామితో గడుపుతారు.
తులా రాశి: మూడ్ చక్కబరచుకోవడానికి ఏదైనా సామాజిక కార్యక్రమానికి హాజరవ్వాలి. ఆలోచించకుండా అడ్డగోలుగా ఖర్చు చేసే వారికి అత్యవసర సమయాల్లో డబ్బు ఎంత అవసరమో తెలిసివస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
వృశ్చిక రాశి: చిరకాల స్నేహితునితో తిరిగి కలవడం హుషారుగా ఉంచుతుంది. వ్యాపారస్తులకు, ట్రేడ్​ వర్గాల వారికి లాభాలు ఉంటాయి. చేసే సమయానుకూల సహాయం, ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. ఈ వార్త కుటుంబ సభ్యులు గర్వించేలా చేస్తుంది. కుటుంబ సభ్యులు మీముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు. ఖాళీ సమయములో మీకు నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చాలాకాలం తర్వాత జీవిత భాగస్వామి నుంచి ఒక చక్కని కౌగిలింతను పొందుతారు.
ధనుస్సు రాశి: అతిగా తినడం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఆర్ధికంగా ఎలాంటి ఢోకా ఉండదు. చెల్లి/ తమ్ముడు మీ సలహాను పొందుతారు. వైవాహిక జీవితంలో అంతా ఆనందమే తాండవిస్తుంది.
మకర రాశి: ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది. మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకుంటారు.
కుంభ రాశి: ఇతరుల విజయాలను పొగుడుతూ ఆనందిస్తారు. జీతాలు లేక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు స్నేహితులను అప్పు అడుగుతారు. మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం కొత్త స్నేహితులను పొందడానికి సహాయ పడుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి జీవిత భాగస్వామితో గొడవ పడతారు. ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది తెలివైన పని. ఆసక్తి కలిగించే చాలా ఆహ్వానాలను అందుకుంటారు. ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి అందుకోబోతున్నారు. జీవిత భాగస్వామితో ఈ రోజు చాలా స్పెషల్ గా గడవనుంది.
మీన రాశి: శ్రమతో కూడిన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఫాంటసీలు ఈ రోజే నిజం కావచ్చు. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని భవిష్యత్తులో లబ్ధిని చేకూర్చనుంది. ఈరోజు ఇతరులను కలవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితం ఈ రోజు ఎంతో గొప్పగా ఉంటుంది.

Related articles

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...