అక్షరటుడే, వెబ్డెస్క్: Feb 01 horoscope | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (ఆదివారం, ఫిబ్రవరి 01) పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న వారికి ఆకస్మిక ధనలాభం, పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది.
మరికొందరికి మాత్రం రోజువారీ పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచు. ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాల విషయంలో అజాగ్రత్తగా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాల విషయంలో ముందస్తుగా ఆలోచించకపోతే నష్టపోయే అవకాశం ఉంది.
మేష రాశి: Feb 01 horoscope | కోర్టుకు సంబంధించిన ఆర్థిక వివాదాలు అనుకూలంగా మారతాయి. అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ పనితనం వల్ల సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. స్నేహితులతో , కొత్త పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: Feb 01 horoscope | ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలవడం వల్ల మానసిక శాంతి, ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలనుకుంటే ఇవాళ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు తమ పాత పద్ధతులను, ఆలోచనలను ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది. ఇవాళ పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం.
మిథున రాశి: Feb 01 horoscope | గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఒప్పందాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: Feb 01 horoscope | గతంలో మొదలుపెట్టిన ముఖ్యమైన పథకాలు, ప్లాన్లు సక్సెస్ అయ్యి, మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఇవాళ ప్రయాణాలు చేయడం, కొత్త వ్యక్తులను కలవడం, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుండటం కోసం.. ఉదయం, సాయంత్రం ‘ఓం బుధాయ నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి.
సింహ రాశి: ఇవాళ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వని బంధువులకు, ఇంటి సభ్యులకు దూరంగా ఉండండి. ఇంట్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే.. అందరి అభిప్రాయాలు తీసుకోండి. సొంత నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది.
కన్యా రాశి: ఇవాళ మీకు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీరు సమయస్ఫూర్తితో, ఎదుటివారిని అర్థం చేసుకుంటూ ఓపికగా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారు.
తులా రాశి: వ్యాపారంలో ఎదుటి వారి సహకారంతో మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే పనికి ఆఫీసులో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఇవాళ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: రోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు ఎదురవ్వచ్చు. మీ వ్యాపార ఆలోచనలను, ప్లాన్లను ఒక్కసారి మళ్లీ చెక్ (Review) చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి సర్ప్రైజ్ లభించవచ్చు. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా, ధ్యానం చాలా అవసరం.
ధనుస్సు రాశి: కుటుంబ సభ్యులతో పాత గొడవలు మర్చిపోయి బంధాలను తిరిగి బలపరుచుకుంటారు. ఇవాళ ఏదైనా కొత్త పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మకర రాశి: ఆరోగ్యం చాలా బాగుంటుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి: పిల్లల చదువుల కోసం, వారి భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆవేశంలో మాట జారవద్దు, అది నష్టం కలిగిస్తుంది. ఏదైనా చెప్పే ముందు ఒక నిమిషం ఆలోచించి మాట్లాడటం మంచిది.
మీన రాశి: గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇవాళ అనుకోకుండా ధనం అందుతుంది. దీనివల్ల సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయి. కుటుంబ వేడుకల్లో పాల్గొంటారు, తద్వారా కొత్త స్నేహితులు పరిచయమవుతారు.