272
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Paddy Centers | రైతులు(Farmers) బాగా ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఐకేపీ(IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి సంజీవ్(Incharge Sanjeev) సూచించారు. అడ్లూర్‌లో శుక్రవారం కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం తీసుకొచ్చిన అనంతరం రైతులు సంబంధించిన పత్రాలను కేంద్రాల్లో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్‌ఛార్జి మీనాక్షి, రైతులు మేడిపల్లి నర్సింహులు, తోట రాజయ్య, ప్రతాప్, రమేష్, సంతోష్, సత్యనారాయణ గౌడ్, మంగలి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.