Homeజిల్లాలుకామారెడ్డిRamareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మహిళలు అధిక సంఖ్యలో క్యూ లైనులో నిలబడడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై మహిళా రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలతో పొలాల్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నామని, అటు పొలాలను చూసుకోవాలా ఇటు యూరియా (Urea) కోసం తిరగాలా అని ప్రశ్నించారు. ఎక్కడిక్కడ సొసైటీలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. విడతల వారీగా యూరియా సరఫరాతో సొసైటీల చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

Must Read
Related News