Homeజిల్లాలుకామారెడ్డిNasrullabad | కొనుగోలు కేంద్రాల కోసం రోడ్డెక్కిన రైతులు

Nasrullabad | కొనుగోలు కేంద్రాల కోసం రోడ్డెక్కిన రైతులు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. నస్రుల్లాబాద్​లో శనివారం రాస్తారోకో చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | కొనుగోలు కేంద్రాల కోసం రైతులు రోడ్డెక్కారు. నస్రుల్లాబాద్​ మండలం బొమ్మన్​దేవ్ పల్లి చౌరస్తా వద్ద శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు (Rice millers) కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

Nasrullabad | రైస్​మిల్లర్లు సహకరించడం లేదు..

తాము కష్టపడి పండించిన పంటను అమ్మడానికి కూడా మిల్లర్లు సహకరించడం లేదని, ధాన్యం తడిగా ఉందని, తక్కువ ధరలు చెబుతూ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Centers) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నా చేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు.