అక్షరటుడే, వెబ్‌డెస్క్: Faridabad terror network module | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ మాడ్యూల్ కేసు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇందులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.
దర్యాప్తు అధికారులు మరో విషయాన్ని వెల్లడించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ నెట్‌వర్క్ గత ఏడాది కాలంగా.. ఆత్మాహుతి బాంబర్ కోసం వెతుకుతున్నట్లు విచారణలో తేలింది. డిల్లీ పేలుడు కేసులో ముఖ్య నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ కరడుగట్టిన ఉగ్రవాది.
కాగా, ఈ కేసు సంబంధించి మరో ముఖ్య నిందితుడు ఎన్ఐఏకు పట్టుబడ్డాడు. పేలుడు జరిగిన కారును రిజిస్ట్రేషన్ చేసిన అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ నిందితుడు జమ్మూ కశ్మీర్‌లోని పాంపోర్‌లోని సంబూరాకు చెందినవాడు.
Faridabad terror network module | 6న భారీ పేలుళ్లకు కుట్ర..
ఉగ్ర నెట్‌వర్క్ కేసులో నిందితులైన డా.ముజమ్మిల్ గనాయీ, డా.ఆదిల్.. పోలీసులకు ముందే పట్టుబడ్డారు. ఈ నిందితుల ఆధారంగా.. దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో జాసిర్ ఎలియాస్ ‘డానిష్’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఉమర్ విషయానికి వస్తే.. డిసెంబరు 6వ తేదీన (బాబ్రీ మసీదు కూల్చివేత దినం) భారీ పేలుళ్లకు ఇతడే ప్రణాళిక రూపొందించినట్లు తేలింది.
అయితే, ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కుట్ర వెలుగుచూడటంతో.. ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
