అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kurnool Bus Accident | బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri Travels) కు చెందిన ఈ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.
ప్రమాదం ఈ తెల్లవారు జామున 3:30 గంటలకు జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆకాశ్ అనే వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించి మంటలు ఎగిసి పడ్డాయి. వెంటనే బస్సులో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. నేను బస్సు అద్దం పగులకొట్టి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాను. నాతో పాటూ మరికొంతమంది కూడా బయటకు వచ్చారు అన్నారు.
Kurnool Bus Accident | క్షణాలలో కాలిపోయింది..
ఇక ఒక మహిళ కూడా పరిస్థితిని వివరించారు . బస్సు ప్రమాదం (Bus Accident) చోటు పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొంది. ఆమె కూడా అదే రోడ్డులో ప్రయాణించడంతో, తమ కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నది. ఏమైంది అని చూడటానికి దిగినప్పుడు, మంటల్లో కాలిపోతున్న బస్సును చూసి షాక్ అయిందట. వెంటనే ఆమె కర్నూలు ఎస్పీ (Kurnool SP)కి ఫోన్ చేసి పరిస్థితిని తెలిపారు. కొద్దిసేపటిలో పోలీసులు సంఘటన స్థలానికి చేరి సహాయ చర్యలు ప్రారంభించారని ఆమె చెప్పారు. ప్రత్యక్ష సాక్షి వివరాల ప్రకారం, చాలా మంది బస్సులోనే మంటల్లో ఆహుతి అయ్యారు. సీట్లకు అతుక్కుపోయిన మృతదేహాలు, కాలిపోయిన అవయవాలు, ఎముకలతో పరిస్థితి భయంకరంగా ఉందని, దాన్ని చూసి తట్టుకోలేకపోయానని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబం కూడా సజీవదహనం అయ్యింది. గోళ్ల రమేశ్ (35), అనూష (30), శశాంక్ (12), మరియు మాన్యత (10) మృతిచెందారు. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం, బస్సు నుంచి 11 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మరియు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని, ఘటనా స్థలంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా పరిస్థితిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కర్నూల్ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి మాటల్లో pic.twitter.com/yCHleJJXbQ
— greatandhra (@greatandhranews) October 24, 2025
