అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ శివారులోని మంజీరా చెక్‌పోస్టు(Manjira Checkpost)లో ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో(Sub Collector Vikas Mahato) సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశాకే అనుమతించాలని సూచించారు. అనంతరం పోతంగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని (Potangal Tahsildar Office) సందర్శించి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ, మెంబర్లను జతచేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ గంగాధర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.
