అక్షరటుడే, కోటగిరి: Kotagiri | బాలబాలికల మధ్య సమానత్వం పాటించాలని ఐసీడీఎస్ సీడీపీవో పద్మ అన్నారు. మహిళా,శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కోటగిరి మండల (Kotagiri mandal) కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాలలో లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Kotagiri | ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో..
ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AR Education Society) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీవో మాట్లాడుతూ.. సమాజంలో బాలబాలిక మధ్య ఎలాంటి లింగబేధం చూపించవద్దన్నారు. ట్రైనర్ శిరీష మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత అంశాలను ఉదాహరణలతో వివరించి, యువ కిశోర బాలురలో లింగ సమానత్వంపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై వివక్ష, హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో ముఖ్యమని ఐసీడీస్ సూపర్వైజర్ శ్రీలత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీలత, కొమురవ్వ, వెంకటరమణ, షీటీం సభ్యులు ఆశన్న, సునీత, పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.