అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఏసీబీ దాడులు చేపడుతున్నా.. కనీసం భయపడటం లేదు. లంచాలు (bribes) తీసుకోవడం ఆపడం లేదు.
రాష్ట్రంలో పలు శాఖల్లో అవినీతి జోరుగా సాగుతోంది. కొంత మంది ఉద్యోగులు లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raid | సర్వే నివేదిక కోసం..
హైదరాబాద్‌లోగల (Hyderabad) ఒక సర్వేనంబర్ సర్వే నివేదికను అందించడానికి తెలంగాణ దేవాదాయ సహాయ కమిషనర్ కార్యాలయంలోని దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేశాడు. రూ.1.50 లక్షలు ఇస్తేనే నివేదిక అందిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.