HomeUncategorizedEncounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

Encounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్​లో సోమవారం తెల్లవారుజామున ఎన్​ కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక టెర్రరిస్ట్​ హతం అయ్యాడు.

కుల్గాంలోని గూడార్ అటవీ ప్రాంతం(Goodar Forest Area)లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్​కౌంటర్(Encounter)​లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది.

Encounter | పక్కా సమాచారంతో..

కుల్గాంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని జమ్మూ కశ్మీర్​ పోలీసులు(Jammu Kashmir Police) సమాచారం అందించారు. దీంతో భారత సైన్యం, కశ్మీర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా సెర్చ్​ ఆపరేషన్(Search Operation)​ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎన్​కౌంటర్​ ప్రారంభించడంతో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ప్రాంతంతో మరో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కూంబింగ్(Coombing)​ చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

Encounter | ఉగ్రవాదుల ఏరివేత

పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత భద్రత బలగాలు జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. నిత్యం సెర్చ్​ ఆపరేషన్​ చేపడుతూ టెర్రరిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఆపరేషన్​ సిందూర్​తో పాకిస్తాన్​లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్, కశ్మీర్​లోని టెర్రరిస్టులను ఏరివేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు పదుల సంఖ్యల్లో ఎన్​కౌంటర్లు చోటుచేసుకోగా అనేక మంది ఉగ్రవాదులు(Terrorists) మరణించారు. ఆపరేషన్​ మహదేవ్​ చేపట్టి పహల్గామ్​ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సైతం బలగాలు మట్టుబెట్టాయి.