అక్షరటుడే, వెబ్డెస్క్ : Kishtwar Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కిష్త్వార్లో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కిష్త్వార్ జిల్లాలోని డోల్గామ్ గ్రామం (Dolgham Village)లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆపరేషన్ ట్రాషి–1 పేరిట కొన్ని రోజులగా కేంద్ర బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ (Coombing) చేపడుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 18 తర్వాత మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా ముందుజాగ్రత్త చర్యగా శుక్రవారం డోల్గామ్ ఎన్కౌంటర్ ప్రదేశంతో సహా విస్తృత ప్రాంతంలో అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Kishtwar Encounter | ముగ్గురు ఉగ్రవాదులు
ఎన్కౌంటర్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా జనవరి 18 కిష్త్వార్లోని చత్రూకు ఈశాన్యంగా ఉన్న సోనార్ ప్రాంతంలో గాలింపు చర్యల సందర్భంగా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆర్మీ పారాట్రూపర్ మరణించారు. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో వారిని డోల్గామ్ గ్రామంలో గుర్తించగలిగాయి. అయితే ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.