అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Municipal Elections | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి, మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే మదన్మోహన్ రావుతో కలిసి పాల్గొన్నారు.
Yellareddy Municipal Elections | సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పేదల పక్షాన ఉందన్నారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నామని వివరించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) వచ్చిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీట్ కావాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Yellareddy Municipal Elections | పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అన్ని వార్డుల్లో బంపర్ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే, సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Yellareddy Municipal Elections | వేగంగా అభివృద్ధి పనులు చేపడతాం
ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) మాట్లాడుతూ అజారుద్దీన్ పుట్టినరోజు నాడు మా నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా మున్సిపల్ అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ (DCC President Mallikarjun), స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
1 comment
[…] నుంచి… Harley Davidson Zero Tax | ఆ మోడల్ బైక్‌లపై… Yellareddy Municipal Elections | ఎల్లారెడ్డి మున్సిపాలిట… Postal Ballot Process Inspection | పోస్టల్ బ్యాలెట్ […]
Comments are closed.