HomeUncategorizedElephant | రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. రెండు గంటల పాటు నిలిచిన రైలు..: వీడియో...

Elephant | రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. రెండు గంటల పాటు నిలిచిన రైలు..: వీడియో వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Elephant | జార్ఖండ్‌ (Jharkhand)లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఏనుగు రైలు పట్టాలపై ప్రసవించింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన రైలు సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది.

ఈ ఇంట్రెస్ట్ ఇంసిడెంట్​ను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ (Union Environment Minister Bhupender Yadav) పంచుకున్నారు. పట్టాలపై ఏనుగు ప్రసవించడాన్ని (elephant gives birth) వివరించారు.

జార్ఖండ్‌ (Jharkhand)లోని రైల్వే ట్రాక్‌పై (railway track) ఓ ఏనుగు ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. అయితే, అదే సమయంలో రైలు ఆ మార్గంలో ఏనుగుకు దగ్గరగా వచ్చింది. కాగా, అటుగా వెళ్తున్న స్థానికులు రైలును, ఏనుగును గమనించారు. వెంటనే అరుస్తూ పరుగు పరుగున వెళ్లి రైలును ఆపేశారు. దీంతో సుమారు రెండు గంటల పాటు అక్కడే ట్రాక్‌పై రైలు ఆగిపోయింది.

Elephant | పండంటి బిడ్డకు జన్మ..

కాసేపటి తర్వాత ఏనుగు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తన బిడ్డతో కలిసి హ్యాపీగా అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రం మంత్రి ఎక్స్‌( X )లో పోస్ట్​ చేశారు. గజరాణి ప్రసవానికి సాయపడిన రైలు సిబ్బంది, స్థానికులు, జార్ఖండ్‌ అటవీ అధికారులను మంత్రి ప్రశంసించారు.

కాగా, కేంద్ర మంత్రి పోస్ట్​ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు పాజిటివ్​గా స్పందిస్తున్నారు. ‘చాలా రోజుల తర్వాత ఓ మంచి వార్త విన్నాం. షేర్‌ చేసినందుకు కృతజ్ఞతలు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.